News March 28, 2025
ప.గో: 15 ఉపసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపసర్పంచ్‌ల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 ఉప సర్పంచుల స్థానాల్లో ఆయా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మరోవైపు పదవీకాలం కేవలం 9 నెలలు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.
Similar News
News March 31, 2025
జీలుగుమిల్లి: అయ్యో పాపం.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి ప.గో జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెంలో ఇటీవల హత్యకు గురైన గంధం బోసు హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోసు భార్య శాంతకుమారి ఆదివారం జైల్లో ఉరివేసుకుని మృతిచెందారు. దీంతో వారి పిల్లలు చెర్రీ(8), ఆరాధ్య(7) అనాథలయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటో తెలియట్లేదు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల పరిస్థితిని చూసిన స్థానికులు అయ్యో పాపం వీరికి ఎంత కష్టమొచ్చిందో అని అంటున్నారు.
News March 31, 2025
కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన కొయ్యలగూడెం(M) సీతంపేట వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం(M) లక్కవరం గ్రామానికి చెందిన వీర నాగేశ్వరరావు, భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి రాజమండ్రి వెళ్తున్నారు. సీతంపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేశ్వరరావు మృతి చెందగా భార్యాపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
News March 31, 2025
కాళ్ల: కోడి పందేలు ఆడుతున్న ముగ్గురు అరెస్ట్

కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ.6,100 నగదు, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.