News June 12, 2024
ప.గో.: 35 ఏళ్ల తర్వాత.. నిమ్మల రికార్డ్

గత ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో TDP 2స్థానాల్లో గెలుపొందగా అందులో పాలకొల్లు ఒకటి. 2019లో YCPప్రభంజనంలోనూ నిమ్మల రామానాయుడు 17809 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డ్ నమోదుచేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే పాలకొల్లు నుంచి 1989లో MLAగా గెలుపొందిన చేగొండి హరిరామ జోగయ్య మంత్రిగా సేవలందించగా.. దాదాపు 35ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి మంత్రి పదవి దక్కినట్లయింది.
Similar News
News February 12, 2026
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో పీఎం శ్రీ, మనబడి మన భవిష్యత్తు పథకాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సమీక్షించారు. విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడిన ఆమె.. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 12, 2026
భీమవరం: స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఐజీ ఆకస్మిక తనిఖీ

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ అశోక్ కుమార్ పరిపాలన, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళా రక్షణ, పోక్సో, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును విశ్లేషించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
News February 12, 2026
భీమవరంలో అన్న క్యాంటీన్‌ని పరిశీలించిన జేసీ

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ను గురువారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాంటీన్‌లోని భోజన పంపిణీ, తాగునీరు, సర్వింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వాష్ ఏరియాను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.


