News January 19, 2026
ప.గో: ALERT.. కోర్టులో JOBS

ఉమ్మడి ప.గో జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జడ్జి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఏలూరు కోర్టుకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా, నిబంధనల వివరాలను జిల్లా కోర్టు, కలెక్టరేట్, గ్రంథాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News January 23, 2026
నరసాపురం: ‘తాబేళ్ల సంరక్షణకు చర్యలు’

తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర పర్యావరణ పరిరక్షణకు దోహదపడే తాబేళ్లను సంరక్షించేందుకు, వాటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖా పరంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి డీఏ కిరణ్ తెలిపారు. గురువారం పీఎం లంక, కేపీపాలెం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.
News January 22, 2026
రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్ నాగరాణి

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తణుకు మండలం యర్రాయి చెరువు గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్లు వ్యయంతో ఏర్పాటుచేసిన హైడ్రోపోనిక్ యూనిట్ గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 22, 2026
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

సాంకేతికతను వినియోగించుకుంటూ సమన్వయంతో పని చేసి పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నయీం అస్మి అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీపడేది లేదని అన్నారు. గురువారం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని డీఎస్పీ, సీఐలతో నేర సమీక్షను నిర్వహించారు. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన నేరాల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచాలన్నారు.


