News March 23, 2024

ప.గో.: REWIND: కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన ఇండిపెండెంట్

image

భీమవరం నియోజకవర్గానికి 1955, 1962లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాచు వెంకట్రామయ్య కాంగ్రెస్ తరఫున వరుస విజయాలు సాధించారు. 1967లో సైతం కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా బి.విజయ్ కుమార్ రాజు పోటీలో నిలిచి 9207 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య హ్యాట్రిక్ విజయానికి అడ్డుపడింది. 1972 నాటికి విజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరి మరోసారి విజయం సాధించారు.

Similar News

News January 1, 2026

భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

image

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.

News January 1, 2026

ప.గో: లక్ష్యం1,780.. కట్టింది ఏడే

image

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి గృహ నిర్మాణాలపై సమీక్షించారు. పీఎంఏవై 1.0 (ఆప్షన్-3) కింద 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్లు నిర్మించాల్సిన ‘అజాయ వెంచర్స్’ సంస్థ.. కేవలం 7 మాత్రమే పూర్తి చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం చేరుకోనందున సదరు నిర్మాణ సంస్థపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News January 1, 2026

తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

image

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్‌పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.