News November 7, 2024
ప.గో: TODAY TOP NEWS

*చింతలపూడి: మంత్రి పార్థసారథితో కూటమి నేతలు భేటి
*గోపాలపురం: ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు
*ఏలూరు: రైల్వే లైన్ పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి
*పెనుగొండ: 25 కాసుల బంగారం చోరీ
*భీమవరం మాజీ MLA ఇంట్లో సోదాలు
*ఉండ్రాజవరం: ఏడుకు చేరిన మృతుల సంఖ్య
*ద్వారకా తిరుమల కొండపై కారు- బస్సు ఢీ
*నిడదవోలులో LIC ఏజెంట్ల ధర్నా
*ఏలూరు: సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
*కొయ్యలగూడెం: ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Similar News
News September 15, 2025
పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 15, 2025
భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.
News September 15, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.