News April 1, 2024

ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

image

సూర్యాపేట జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధ కళా ఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆదివారం వెలికి తీశారు. తవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్తంభాలు బయటపడ్డాయి. 2015లో కూడా ఫణిగిరిలో 2వేల ఏళ్లనాటి బౌద్ధ అవశేషాలను పురావస్తు శాఖ వారు కనుగొన్నారు.

Similar News

News April 25, 2025

మిర్యాలగూడ: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదని బాధతో యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే ఎస్ఐ బి.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ నగర్ బంధంకు చెందిన చల్లా కళ్యాణ్ పెళ్లి కావడం లేదని కొంత కాలంగా బాధపడుతున్నాడు. బుధవారం బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చిన తరువాత మనస్తాపంతో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

News April 25, 2025

మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం

image

మిర్యాలగూడ – సాగర్ రోడ్డులో ఉన్న న్యూ విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ వర్క్స్‌లో నిప్పు అంటుకొని భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News April 25, 2025

NLG: ఏడాది నుంచి ఎదురుచూపులే..!

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన మాతా శిశు ఆరోగ్య (MCH) కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకాలు కూడా బందయ్యాయి. అలాగే గర్భిణులకు న్యూట్రీషన్ కిట్ల సరఫరా కూడా నిలిచిపోయింది. కిట్లతోపాటు ప్రోత్సాహక నిధులు గతేడాది మార్చి నుంచి రావడంలేదని మహిళలు తెలిపారు. ప్రభుత్వ స్పందించి కిట్లతో పాటు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.

error: Content is protected !!