News June 12, 2024

ఫరూఖ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్‌కు మంత్రి పదవులు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూఖ్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 11 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ, ఒకటి బీజేపీ గెలుపొందాయి.

Similar News

News October 1, 2024

కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు

image

కర్నూలులోని వన్‌టౌన్‌ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్‌ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్‌, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.

News October 1, 2024

నేడు పత్తికొండకు CM చంద్రబాబు

image

కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 1, 2024

800 మందితో భారీ బందోబస్తు: కర్నూలు ఎస్పీ

image

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.