News November 16, 2025
ఫర్నిచర్ కొనేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

ఆఫర్ ఉందనో, డిజైన్ నచ్చిందనో తొందరపడి ఫర్నిచర్ కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. నిజంగా మీకు ఆ వస్తువు అవసరం ఉందో, లేదో.. ఆలోచించండి. తక్కువ ధరకు దొరుకుతుందని నాణ్యతను పట్టించుకోకపోతే నష్టపోతారు. నాణ్యతే ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండ్‌ను ఫాలో అవుతూ కొనుగోలు చేయొద్దు. అది ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి.. చూడటానికి ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది.
Similar News
News November 16, 2025
వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.
News November 16, 2025
మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.
News November 16, 2025
రేషన్ కార్డు ఉంటేనే..

TG: ఫీజు రీయింబర్స్‌మెంటును పెద్దఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింక్ చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


