News December 24, 2025

ఫలించిన సునీల్ గవాస్కర్ పోరాటం

image

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పోరాటం ఫలించింది. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టు నుంచి <<18640617>>పర్సనాలిటీ రైట్స్<<>> పొందిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచారు. గవాస్కర్ పేరు, ఫొటోలను తప్పుగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనుమతి లేని పోస్టులు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని కోర్టు ఆదేశించింది. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు ఈ రైట్స్ పొందారు.

Similar News

News December 26, 2025

SWAMIH-2: ఇళ్ల నిర్మాణానికి ₹15 వేల కోట్లు!

image

ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం స్వామి(SWAMIH)-2 ఫండ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ₹15 వేల కోట్ల నిధి ద్వారా లక్ష మంది మిడిల్ క్లాస్ గృహ కొనుగోలుదారులకు లబ్ధి కలగనుంది. స్వామి-1 ఫండ్‌తో ఇప్పటికే 55 వేల ఇళ్లను పూర్తిచేశారు. వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రాజెక్టులకు చివరి దశ నిధులను ఈ స్కీమ్ అందిస్తుంది. హోంలోన్ EMIలు చెల్లిస్తున్నా, నిర్మాణం ఆగిపోయి ఇల్లు అందని వారికి ఊరట దక్కనుంది.

News December 26, 2025

మామిడిలో బోరాన్ ఎప్పుడు స్ప్రే చేయాలి?

image

మామిడి పంట లేత పూమొగ్గ, పిందె దశలలో (గోళీ సైజులో ఉన్నప్పుడు) బోరాన్ పిచికారీ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. పూమొగ్గ దశలలో బోరాన్ పిచికారీ చేయడం వల్ల ఫలదీకరణ మెరుగుపడుతుంది. బోరాన్ పుప్పొడి మొలకెత్తడానికి, పుప్పొడి నాళం పెరుగుదలకు చాలా అవసరం. ఫలదీకరణకు, పండ్ల అభివృద్ధికి కీలకంగా పని చేస్తోంది. అంతేకాకుండా పూత రాలడం తగ్గి, పిందె నిలబడడం పెరుగుతుంది. పండ్లు పగలకుండా ఉంటాయి.

News December 26, 2025

జైలర్-2లో షారుఖ్ ఖాన్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చారు. జైలర్-2లో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్నారని చెప్పారు. మూవీలో విలన్‌గా మిథున్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది.