News May 7, 2024

ఫలితాలు విడుదల.. మొదటి మూడు ర్యాంకులు విశాఖవే

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఏయూ ఈఈటీ – 2024 ఫలితాలు మంగళవారం వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. పెందుర్తికి చెందిన సాయి ఈశ్వర్ మొదటి ర్యాంకును, చంద్రంపాలెంకు చెందిన కే సాయి ప్రణీత్ రెండవ ర్యాంకును, తగరపువలసకు చెందిన జీ మోహన్ సాయి సంపత్ మూడవ ర్యాంకును సాధించారు.

Similar News

News September 30, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1.39 కోట్లు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా 28 రోజులకు రూ.1,39,44,045 నగదు లభించింది. భక్తులు కానుకల రూపంలో వేసిన బంగారం 53 గ్రాముల 200 మి. గ్రాములు, వెండి 8 కిలోల 650 గ్రాముల 500 మి.గ్రా. లభించింది. అలాగే యూఎస్ఏ డాలర్లు 77, కెనడా డాలర్లు 20, సింగపూర్ డాలర్లు 30, యూఏఈ దిరమ్స్ 130తో పాటు వివిధ దేశాల కరెన్సీ లభించింది.

News September 30, 2024

AU: అక్టోబర్ 1న బి.ఆర్క్ స్పెషల్ ఎగ్జామినేషన్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయిదవ సంవత్సరం రెండవ సెమిస్టర్ స్పెషల్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 2019- 20 నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని వివరించారు.

News September 30, 2024

హుకుంపేట: ‘2 రోజులు మా గ్రామానికి రావొద్దు’

image

హుకుంపేట మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని దాలిగుమ్మడి గ్రామస్థులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. సోమ, మంగళవారం బయటి వ్యక్తులెవరూ గ్రామంలోకి రావొద్దని బారికేడ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి వైరల్ జ్వరాలు, ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు  అ 2రోజులు పాటు అమ్మోరు పండుగ జరుపుకుంటామని వారు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బయటి వ్యక్తులను అనుమతిస్తామన్నారు.