News April 22, 2025

‘ఫసల్ భీమా’ యోజన అమలు చేయాలి: ఎమ్మెల్సీ

image

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ‘ఫసల్ భీమా’ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు జరుగుతుంది అంజిరెడ్డి అన్నారు.

Similar News

News April 22, 2025

ట్రంప్‌కు షాక్.. కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ

image

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పై హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. $2.2 బిలియన్ల <<16113020>>ఫండ్స్ <<>>నిలిపేస్తామని బెదిరింపులకు పాల్పడటంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బలవంతంగా హార్వర్డ్‌ను తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

News April 22, 2025

నేడే ఇంటర్ ఫలితాలు.. NGKLలో 13,454 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 13,454 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 6,477, సెకండియర్‌లో 6,977 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST

News April 22, 2025

విజయవాడలో మృతదేహం కలకలం

image

విజయవాడ కస్తూరిబాయిపేటలో సోమవారం సాయంత్రం మృతదేహం కలకలం రేపింది. సూర్యారావుపేట పోలీసుల వివరాల ప్రకారం.. బోసు బొమ్మ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ వ్యక్తి ఎవరికైనా తెలిస్తే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి అన్నారు.

error: Content is protected !!