News April 4, 2025

ఫామ్ పౌండ్ నిర్మాణంతో అభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

image

వ్యవసాయ భూములలో ఫామ్ పౌండ్ నిర్మించుకుంటే రైతుల ఆర్థికాభివృద్ధి తోడ్పడుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులపై పాల్వంచలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం వీసీ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News July 6, 2025

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT

News July 6, 2025

మాలిలో మాచర్ల యువకుడు కిడ్నాప్.. విదేశాంగ శాఖకు లేఖ

image

మాలిలో మాచర్లకు చెందిన అమరలింగేశ్వరరావును<<16955422>> ఉగ్రవాదులు<<>> కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. జులై 1న ఏస్ నగరంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉగ్రవాదులు అమరలింగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్యాబిడ్డలు HYDలో ఉంటున్నారు. తమ కుమారుడిని విడిపించాలని కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలువగా ఆయన విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

News July 6, 2025

వడమాలపేట: TTDలో ఉద్యోగాల పేరుతో మోసం

image

వడమాలపేట మండలం అమ్మగుంట హరిజనవాడకు చెందిన పులి శేఖర్ అనే వ్యక్తి TTDలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. అతనితోపాటు డిగ్రీ చదివిన వారికి ఫోన్ చేసి TTDలో ఉద్యోగాలు అంటూ ఆశ చూపి వేలుకు వేలు తీసుకుని ముఖం చాటేస్తున్నాడని బాధితులు వాపోయారు.