News March 28, 2025

ఫారిన్ వెళ్లిన ఏలూరు SP, JC

image

ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇద్దరూ కలిసి వియత్నాం దేశానికి పయనమయ్యారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఈనేపథ్యంలో ప.గో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌కు ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.

Similar News

News November 10, 2025

నిజామాబాద్ రైతన్న.. యాసంగికి రెడీ..!

image

ఉమ్మడి NZB జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సంమృద్ధిగా నీరు వచ్చి చేరింది. శనగ, వరి మెుక్కజొన్న పంటలు ఎక్కువ మెుత్తంలో సాగయ్యే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పొచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా నీటిని అందించనున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉంది.

News November 10, 2025

జగిత్యాల కవయిత్రికి ‘కీర్తి’ చక్ర పురస్కారం

image

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ మద్దెల సరోజన “జాతీయ కీర్తి చక్ర-2025” పురస్కారం అందుకున్నారు. కరీంనగర్‌లో ఆర్యాణి సకల కళా వేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కవయిత్రి సరోజనను జగిత్యాలకు చెందిన కవులు, కళాకారులు అభినందించారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: పోలింగ్‌ కోసం 3 వేల మంది ఉద్యోగులు

image

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.