News September 5, 2025

‘ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

image

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఈనెల 7న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపైన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,186 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు.

Similar News

News September 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

☛ ఆమదాలవలసలో వివాహిత సూసైడ్
☛రణస్థలం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
☛టెక్కలి: నిర్లక్ష్యం.. నేడు శాపం అవుతోందా?
☛పలాస: ఆటో ఢీకొని యువకుడు మృతి
☛ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది: కలెక్టర్
☛మందస: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
☛నరసన్నపేట: బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం
☛గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే కూన రవి కుమార్

News September 5, 2025

ఆమదాలవలసలో వివాహిత సూసైడ్

image

ఆమదాలవలస మండలం చిట్టివలసకు చెందిన పూర్ణ (22) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 4 నెలల కిందట ఈమెకు వివాహమైంది. అప్పటి నుంచే ఆమె వరకట్న వేధింపులను తాళలేక పుట్టింటికి వచ్చేసింది. అనంతరం పెద్దల సమక్షంలో అత్తారింటికెళ్లిన పరిస్థితి మారలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదైంది.

News September 5, 2025

టెక్కలి: విద్యార్థుల ప్రతిభకు ఈయన పాఠాలే మూలం

image

ఉపాధ్యాయుడిగా కాకుండా కళాకారుడు, చిత్రకారుడు, మైమ్ ఆర్టిస్ట్, నృత్యకారుడు, ప్రజాఉద్యమకారుడు, నాటక రచయిత తదితర రంగాల్లో డీఏ స్టాలిన్ తనదైన ముద్ర వేశారు. టెక్కలికి చెందిన ఈయన 1983-2018 వరకు టీచర్‌గా పని చేశారు. పిల్లలను ప్రతిభావంతులను చేసేందుకు బొమ్మాలాటలతో విద్యనందించారు. ఇందుకు 2008లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.