News February 6, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో మరికొన్ని ప్రయోజనాలు

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చు. PM KISANకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. రైతుల వివరాలు కచ్చితంగా నమోదై ఉండటం వల్ల అర్హులకే సర్కారు పథకాల ఫలాలు అందుతాయి. నిధుల జమలో పారదర్శకత పెరుగుతుంది. బీమా, సబ్సిడీ, రుణాలు త్వరగా రైతులకు చేరతాయి. ఒకే ఐడీతో ప్రభుత్వ సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని పథకాల అమలును ఈ ఐడీ సులభతరం చేస్తుంది.

Similar News

News February 7, 2026

ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

image

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <>వెబ్‌సైట్‌లో<<>> ఏజెన్సీ, KYC యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 18002333555కు కాల్ చేయండి.

News February 7, 2026

సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చెయ్యొచ్చా?

image

మొదటిసారి సిజేరియన్‌ చేసి బిడ్డను తీస్తే, రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్‌ తప్పదని చాలామంది భావిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ మొదటి డెలివరీ ఎలా జరిగింది, ఎలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి, బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యం, రెండు డెలివరీలకు మధ్య గ్యాప్‌పై ఆధారపడి ఉంటుంది. రెండో డెలివరీ నార్మల్ అవ్వాలంటే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

News February 7, 2026

ఎల్లుండి ఢిల్లీకి సీఎం.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.