News February 6, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ఎక్కడ నమోదు చేస్తారు? ఏ పత్రాలు కావాలి?

తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణా అధికారి(AEO) ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లిస్తే నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. దీని కోసం ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. వీటిని తీసుకొని రైతులు పైన సూచించిన కేంద్రాలకు వెళ్లాలి.
Similar News
News February 7, 2026
ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <
News February 7, 2026
సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చెయ్యొచ్చా?

మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే, రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదని చాలామంది భావిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ మొదటి డెలివరీ ఎలా జరిగింది, ఎలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి, బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యం, రెండు డెలివరీలకు మధ్య గ్యాప్‌పై ఆధారపడి ఉంటుంది. రెండో డెలివరీ నార్మల్ అవ్వాలంటే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
News February 7, 2026
ఎల్లుండి ఢిల్లీకి సీఎం.. సర్వత్రా ఉత్కంఠ

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.


