News February 5, 2026
ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ కీలకమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
Similar News
News February 7, 2026
క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన

AP: అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి CM చంద్రబాబు ఇవాళ 3PMకు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొచ్చేందుకు IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
News February 7, 2026
కాలే కడుపునకు మండే గంజి

విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు నోరు కాలేంత వేడి గంజి ఇచ్చినా అది ఎంతో రుచిగా, తృప్తిగా అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేదుగా అనిపిస్తాయి. ఏదైనా వస్తువు లేదా సాయం మనకు బాగా అవసరమైనప్పుడు దాని నాణ్యత కంటే ఆ సమయంలో అది అందడమే గొప్ప విషయంగా భావిస్తాము. నిజ జీవితంలో సరైన సమయానికి లభించే సాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ సామెతను వాడుతుంటారు.
News February 7, 2026
సూర్యుడికి అర్ఘ్యం.. ఎప్పుడు సమర్పించాలంటే?

2026, FEB 8న భాను సప్తమి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యోదయ ముహూర్తంలో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్ఠం. మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకే ప్రారంభమవుతుంది. కావున 5:26 AM – 7:13 AM మధ్య పుణ్యస్నానాలు ఆచరించాలి. ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా వదలాలి. ఈ పవిత్ర సమయంలో ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం.


