News August 20, 2025
ఫార్మా కపెంనీలో మందుల మాటున మత్తు..!

రాంబిల్లి మండలం లాలంకోడూరు పరిధిలో ఎవరెక్స్ డ్రగ్స్ కంపెనీలో డీఆర్ఐ అధికారులు రూ.23.88 కోట్ల విలువైన <<17433639>>మత్తు మందుల<<>> మిశ్రమాన్ని, 119 కిలోల రసాయన మిశ్రమం, 87.88 కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను తీసుకువచ్చి ఆల్ఫ్రాజోలం మత్తు మాత్రలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని తయారు చేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 14, 2026
ATP: భార్యపై చాకుతో దాడి.. భర్త అరెస్ట్

అనంతపురంలో భార్యపై భర్త <<19650878>>చాకుతో దాడి<<>> చేసిన ఘటన తెలిసిందే. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారన్నారు. నిందితుడు రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్, గాయపడిన తేజస్వినిది ప్రేమ వివాహమన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అడ్డు వచ్చిన లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయన్నారు.
News April 14, 2026
చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
News April 14, 2026
గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.


