News March 17, 2025

ఫాస్ట్‌గా ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్

image

ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 10నుంచి అధికారులు పేపర్లు దిద్దుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్ని పేపర్లను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలోనే వాల్యుయేషన్ చేస్తున్నారు. కాగా ప్రతీ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రాసెస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

Similar News

News March 17, 2025

ఇన్‌స్టాలో ప్రేమ.. మూడు నిండు ప్రాణాలు బలి

image

ఇన్‌స్టాలో మొదలైన 2 వేర్వేరు ప్రేమకథలు విషాదాంతంగా ముగిశాయి. TGలో హుజూరాబాద్‌కు చెందిన రాహుల్(18), నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత(20) ఇన్‌స్టాలో ప్రేమించుకున్నారు. పెద్దవారికి భయపడి ఇద్దరూ రైలు కింద పడి చనిపోయారు. ఇక గుంటూరుకు చెందిన సాయికుమార్, గీతిక అనే జంట ఇన్‌స్టాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మరణించింది. భర్తే చంపాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

News March 17, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి బస్తాలను అధిక సంఖ్యలో రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలికిందని చెప్పారు. గత వారం పత్తి ధర రూ.6,960 పలకగా ఈరోజు ధరలు భారీగా పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News March 17, 2025

VKB: విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

వికారాబాద్ జిల్లా దోమ మండలం గన్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నేనావత్ బాలాజీ (13) ఆదివారం మధ్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి మృతిచెందాడు. ఈరోజు ఉదయం చెరువులో శవమై కనిపించాడు. బాలుడి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!