News August 29, 2025

ఫించన్‌కు జిల్లా వ్యాప్తంగా 3,900 మంది అప్పీలు

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్‌కు అనర్హలుగా నోటీసులు అందుకున్న వారికి ప్రభుత్వం అప్పీలుకు అవకాశం కల్పించింది. ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద ఇప్పటి వరకు అప్పీలు చేసుకొన్న వారికి సెప్టెంబర్ 1వ తేదీన యాథావిథిగా పింఛన్ నగదు చెల్లించనున్నారు. జిల్లాలో 6,480 మంది నోటీసులు అందుకోగా, ఇప్పటివరకు 3,900 మంది అప్పీలు చేసుకొన్నట్లు DRDA పీడీ శోభన్ బాబు తెలిపారు.

Similar News

News September 1, 2025

NTR: రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల జరిగిన LLM 1వ, LLB 1, 6వ, BLB 1, 5, 10వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

News September 1, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 88 దరఖాస్తుల స్వీకరణ

image

మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 88 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, అదనపు కలెక్టర్లు రాధికాగుప్త, విజయేందర్ రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని సూచించారు.

News September 1, 2025

శామీర్‌పేట్: సీపీఎస్‌ను రద్దు చేయాలని నిరసన

image

సీపీఎస్‌ను రద్దు చేయాలని 206 సంఘాలుగా ఏర్పడిన మేడ్చల్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్ దారుల సంఘం సభ్యులు అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.