News January 1, 2026

ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగర్‌ కర్నూల్ కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిట్‌ నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జనవరి 1-31 వరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Similar News

News February 20, 2026

కోనసీమలో మరో 200 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ?

image

వచ్చే ఉగాది నాటికి DSC నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రభుత్వ ప్రకటన జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ ప్రకటనతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేశారు. గత మెగా DSC ద్వారా జిల్లాలో ఇప్పటికే 436 మంది ఉపాధ్యాయ కొలువులు సాధించగా, తాజాగా మరో 200 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

News February 20, 2026

VZM: ‘ప్రభుత్వ పథకాల లక్ష్యాలను సాధించాలి’

image

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. శుక్రవారం నిర్వహించిన VCలో పలు శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పీజీఆర్ఎస్ వినతులు, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్యుత్, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, తదితర లక్ష్యాలను సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో JC సేతుమాధవన్ పాల్గొన్నారు.

News February 20, 2026

ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

image

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.