News March 12, 2026
ఫిబ్రవరిలో పెరిగిన ద్రవ్యోల్బణం

దేశంలో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2%కు పెరిగింది. కాగా ఇది జనవరిలో 2.74%గా ఉంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది RBI నిర్ణయించిన 2-6% టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉందని కేంద్రం తెలిపింది. ఆహార ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.75%గా ఉంది.
Similar News
News April 8, 2026
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర

బంగారం ధరతో పాటు వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 ఎగబాకింది. దీంతో ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,65,000కు చేరింది.
News April 8, 2026
ప్రపంచ శాంతికి గొప్ప రోజు : ట్రంప్

ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ కూడా శాంతిని కోరుకుంటోందని చెప్పారు. ‘హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికా సాయం చేయనుంది. భారీగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. అంతా సవ్యంగా జరిగేలా చూసుకునేందుకు మేం అక్కడే ఉంటాం. US మాదిరే మిడిల్ ఈస్ట్‌లోనూ స్వర్ణ యుగం వస్తుంది’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
News April 8, 2026
‘ధురంధర్-2’ సక్సెస్‌పై మౌనం వీడిన దీపిక

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె పోస్ట్ పెట్టలేదంటూ SMలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘మీకంటే ముందే నేను సినిమా చూశా. SMలో పెట్టనంత మాత్రాన సపోర్ట్ చేయనట్లా?’ అని కౌంటర్ ఇచ్చారు. రణ్‌వీర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె అనవసర విమర్శలకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు.


