News January 3, 2026

ఫిబ్రవరిలో మున్సి‘పోల్స్’: మంత్రి అడ్లూరి

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ రావొచ్చని అసెంబ్లీలో చిట్ చాట్‌లో ఆయన వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Similar News

News January 7, 2026

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని చెప్పింది. అయితే తుఫానుగా మారుతుందా? లేదా? అనేది ప్రకటించలేదు. వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడుతో పాటు ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News January 7, 2026

త్వరగా పెళ్లి కావాలంటే.. పఠించాల్సిన మంత్రాలు

image

*కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ|
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః||
*అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః|
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర||
*విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే||
*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే|
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే||

News January 7, 2026

గ్రీన్‌లాండ్ కావాల్సిందే.. అవసరమైతే సైన్యాన్ని వాడతామన్న US

image

గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం తమకు చాలా ముఖ్యమని అమెరికా తేల్చి చెప్పింది. అవసరమైతే సైన్యాన్ని వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం సంచలనం రేపుతోంది. రష్యా, చైనాలను అడ్డుకోవడానికి ఈ ద్వీపం తమకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్, ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని యూరప్ నేతలు అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.