News December 31, 2024
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు: మంత్రి అనగాని

రాష్ట్రంలో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సవరిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తమన్నారు.
Similar News
News September 14, 2025
సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం.
News September 14, 2025
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

గుంటూరు శ్రీరామ్ నగర్‌లో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ.200గా అమ్ముతున్నారు. కొరమేను చేపలు కేజీ రూ.450, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 220, మటన్ రూ.950గా విక్రయిస్తున్నారు. నగరంలోని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో రూ. 20 నుంచి రూ. 50ల వరకు ధరల్లో వ్యత్యాసం ఉంది.
News September 14, 2025
GNT: నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.