News January 19, 2026

ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’: కలెక్టర్

image

జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల‌తో నీటిని సరఫరా చేయాలన్నారు.

Similar News

News February 24, 2026

VZM: పెసలు, మినుములకు ప్రభుత్వ మద్దతు ధర ఇదే

image

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉంటుందని, కొనుగోళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నిర్వహిస్తారన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

News February 23, 2026

బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

News February 23, 2026

VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.