News January 20, 2026

ఫిబ్రవరి 10లోగా ‘ఈ-క్రాప్’ పూర్తి చేయాలి: కర్నూలు కలెక్టర్

image

ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈ-పంట బుకింగ్, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పురోగతి సాధించాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 8, 2026

వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.

News February 7, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.

News February 7, 2026

ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూల్ డీఆర్‌వో వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రవాణా, విద్యుత్, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.