News January 30, 2026
ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయంపై ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం నీటిని తెలంగాణ తరలిస్తుంటే సీఎం చంద్రబాబు ప్రశ్నించకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. సీమ రైతుల ప్రయోజనాల కోసం ఈ పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 11, 2026
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సరళి ఏవిధంగా ఉందంటే!

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో 1,49,525 మంది ఓటర్లున్నారు. జిల్లాలో పోలింగ్ సరళి ఉదయం మందకోడిగా సాగిన, పోలింగ్ ముగిసే సమయానికి పుంజుకుంది.
ఉదయం 9గం.లకు 6%
ఉదయం 11గం.లకు 26.86%
మధ్యాహ్నం 1గం.లకు 47.13%
సాయంత్రం 3గం.లకు 59.90%
పోలింగ్ పూర్తయ్యేసరికి 69.48%గా నమోదయ్యాయి.
News February 11, 2026
ఆర్టీసీలో 115 మంది ఉద్యోగులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) విజయవాడ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు, విజయనగరం, పార్వతీపురం మన్యం రీజియన్లలో వివిధ వర్గాలకు చెందిన 115 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదోన్నతులు సంస్థలో ఉద్యోగుల ఎదుగుదలకు దోహదపడతాయని ఆమె తెలిపారు.
News February 11, 2026
విశాఖ హోటళ్లకు పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు

మిలాన్, ఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సదస్సుల నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి హోటల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో DFMD, HHMD తనిఖీలు, CCTV నిఘా పెంచాలని ఆదేశించారు. అతిథుల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బంది వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. VVIPల భద్రతలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు


