News January 30, 2026
ఫిబ్రవరి 6న OTTలోకి ‘రాజాసాబ్’!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్‌స్టార్ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్‌తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
Similar News
News February 10, 2026
విశాఖకు మెట్రో రైలు.. 3 రూట్లు ఇవే

AP: సుమారు 46KM పొడవు, 3 కారిడార్లు, రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మెట్రోకు కేంద్రం ఓకే చెప్పింది.
*30-35KM దూరంతో స్టీల్ ప్లాంట్(గాజువాక)-కొమ్మాది మధ్య అత్యంత పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది.
*సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు 5-6KM దూరంతో గురుద్వారా జంక్షన్-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ రానుంది.
*6-7KM దూరంతో పర్యాటకం+సిటీని కలుపుతూ తాటిచెట్లపాలెం-RK బీచ్ వరకు మూడో కారిడార్ వస్తుంది.
News February 10, 2026
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.
News February 10, 2026
న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: న్యూజిలాండ్‌పై UAE జట్టు విజృంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 173/6 రన్స్ చేసింది. వసీమ్(66*) అలిషాన్(55), మయాంక్ కుమార్(21) చెలరేగారు. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ 27 రన్స్ సమర్పించుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2, డఫ్పీ, ఫిలిప్స్, శాంట్నర్, ఫెర్గ్యూసన్ తలో వికెట్ దక్కింది. విజయం కోసం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 174 రన్స్ చేయాలి.


