News February 6, 2026

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

Similar News

News February 17, 2026

ఇందాపూర్ సహా 4 డెయిరీలకు నెయ్యి ఆర్డర్లు: BR నాయుడు

image

AP: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యి కొనుగోలులో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘నెయ్యి నాణ్యత తగ్గకుండా సేకరణ పరిధిని 1,500KM నుంచి 800KMకు తగ్గించాం. ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ ఏర్పాటుచేశాం. అలాగే ఇందాపూర్ డెయిరీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చామనేది అవాస్తవం. ప్రమాణాలు పాటించిన నందిని, మదర్, సంగం డెయిరీలకూ ఆర్డర్లు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.

News February 17, 2026

అప్పటి నుంచే పతనం మొదలైందా..?

image

2023 వన్డే ప్రపంచకప్ గెలిచాక మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్లలో చెత్త ప్రదర్శన చేసింది.
*2024 టీ20 WCలో సెమీస్ చేరలేకపోయింది.
*27 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై WIతో టెస్టు ఓటమి
*2025 CT సెమీఫైనల్లో భారత్‌తో ఓటమి
*2025 WTC ఫైనల్లో SAతో ఓటమి
*పాక్, శ్రీలంక, SAతో వన్డే సిరీసుల్లో ఓటమి
*టీ20 WC-2026లో జింబాబ్వే చేతిలో ఓటమి

News February 17, 2026

AI+డేటా.. రెండేళ్లలో $200Bn పెట్టుబడులు: అశ్వినీ వైష్ణవ్

image

భారత్‌లో AI, డేటా రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ 2 రంగాలు రెండేళ్లలో $200 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా వేశారు. క్లౌడ్ సేవలను అందించే కంపెనీలకు 21 ఏళ్ల పన్ను మినహాయింపు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఢిల్లీలో నిర్వహిస్తోన్న AI సమ్మిట్ కంపెనీల ప్రతిభను ప్రపంచానికి చూపడానికి ఓ గొప్ప అవకాశమన్నారు. దేశం ITలోనూ సత్తా చాటుతోందని పేర్కొన్నారు.