News January 3, 2026
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు: కలెక్టర్

పల్నాడు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7,8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం నోడల్ అధికారిగా జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియని నియమించారు.
Similar News
News January 5, 2026
మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.
News January 5, 2026
రెవెన్యూ క్లినిక్‌లను సమర్ధంగా నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

రెవెన్యూ క్లినిక్‌లు సమర్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
News January 5, 2026
ASF: ‘అటవీ గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలి’

ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుడిమేత విశ్వనాథ్ కోరారు. ఈమేరకు కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఈనెల 11న మార్లవాయిలో జరిగే హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి సభ ఏర్పాట్లకు సహకరించాలని విన్నవించారు.


