News March 31, 2025

ఫిరంగిపురం: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

ఫిరంగిపురంలో పిల్లల్ని సవతి తల్లి లక్ష్మి కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కాగా కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

Similar News

News April 3, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు

image

గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాత్రికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్‌ ప్రకటనలో తెలిపాడు. అలాగే, జిల్లా పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

News April 3, 2025

బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

image

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.

error: Content is protected !!