News March 12, 2025
ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చే ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 13, 2025
HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.
News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.