News February 3, 2025
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 3, 2025
పులివెందులలో అరటికాయల వ్యాపారి హత్య
పులివెందుల పట్టణం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి అరటికాయల మోహన్‌పై కొంతమంది దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. అరటికాయల వ్యాపారి రూ.2 వేలు అప్పు చెల్లించలేదనే నెపంతో కొంతమంది దాడి చేసినట్లు తెలుస్తోంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందినట్లు తెలిసింది.
News February 2, 2025
కొండాపురం: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొండాపురం రైల్వే స్టేషన్ – చిత్రావతి బ్రిడ్జి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనలో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని ఎర్రగుంట రైల్వే పోలీసులు తెలిపారు.
News February 2, 2025
కడప: ఫాతిమా కాలేజీ హాస్టల్లో వ్యక్తి సూసైడ్
కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరాఖాన్ (43) అనే వ్యక్తి అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో తాను ఉంటున్న గదిలోనే చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే కళాశాలలో అతని భార్య ఫరియా వార్డెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు ఉన్నారు. వీరు రెండేళ్ల క్రితం కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. భార్య ఫరియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.