News February 25, 2025

ఫిర్యాదులను 1950 నంబరుకు తెలియజేయండి: కలెక్టర్

image

ఏలూరు కలెక్టరేట్లో సోమవారం MLC ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950 నంబరుకు తెలియపర్చవచ్చన్నారు. మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే సమాచారం అందించాలన్నారు. 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 71 జోనల్ అధికారులు, 99మంది రూట్ అధికారులను నియమించినట్లు చెప్పారు.

Similar News

News February 28, 2026

శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

image

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని రద్దు చేసింది.

News February 28, 2026

మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలి: కలెక్టర్

image

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

News February 28, 2026

అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి: కలెక్టర్

image

గద్వాల జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలంటే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, ఫార్మర్ రిజిస్ట్రేషన్, గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.