News December 22, 2025

ఫిర్యాదులపై సత్వర చర్యలు: సూర్యాపేట ఎస్పీ

image

బాధితులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో వేగంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 3, 2026

నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

image

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.

News January 3, 2026

‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

image

పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్‌గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.

News January 3, 2026

KMR: సంక్రాంతికి ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతి పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లకు రక్షణ కల్పించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇంటి ముందు వెనుక భాగాల్లో రాత్రిపూట లైట్లు వెలిగేలా ఏర్పాటు చేయండి. బంగారు ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం అని అన్నారు. మీ వీధిలో అనుమానిత వ్యక్తులు లేదా కొత్తవారు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయాలని సూచించారు.