News October 12, 2025
ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఫిర్యాదుదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
Similar News
News October 11, 2025
చిత్రకారులకు యిదే మా ఆహ్వానం: గజల్ శ్రీనివాస్

వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అమరావతిలోని శ్రీసత్యసాయి స్పిరిచువల్ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారులు తమ ప్రతిభను ఆవిష్కరించడానికి వేదికగా మన అమరావతి పేరుతో చిత్రకళాప్రదర్శన ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు.
News October 11, 2025
GNT: మిర్చీ యార్డులో 41,281 మిర్చి టిక్కీల అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 42,595 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 41,281 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 11,715 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.
News October 11, 2025
చేబ్రోలులో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్‌లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.