News March 23, 2025
ఫిలింనగర్: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
Similar News
News March 25, 2025
HYD: ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్

GHMC ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియంలో APR 7 నుంచి 10 వరకు జరుగుతాయి. పురుషులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలున్నాయి. చెస్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. ఇండోర్స్ గేమ్స్ కూడా ఉన్నాయి.
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 24, 2025
హైటెక్‌సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

టీ, స్నాక్స్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్‌సిటీలో నూతన బ్రాంచ్‌ను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్‌లెట్‌ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్‌తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.