News March 29, 2025
ఫిలిప్పీన్స్‌కు యాదాద్రి భువనగిరి బియ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఫిలిప్పీన్‌కి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా జిల్లాలోని నాలుగు మిల్లుల నుంచి 1,570 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేయాల్సి ఉంది. తొలి విడతలో 570 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని APలోని కాకినాడ పోర్టుకు లారీల ద్వారా చేరవేశారు. అక్కడి నుంచి నౌకలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయనున్నారు.
Similar News
News February 25, 2026
సంగారెడ్డి: కానిస్టేబుల్‌కు LOVE వేధింపులు.. హత్య!

కానిస్టేబుల్ మందారిక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కానిస్టేబుల్ జాల ప్రకాష్‌కు సంగారెడ్డి కోర్టు మరో ఆరేళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించింది. ప్రకాశ్ 2014లో SRD మహిళా ఠాణాలో పనిచేస్తూ కానిస్టేబుల్ మందారికను ప్రేమ పేరిట వేధించారు. తట్టుకోలేక ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆమెపై కక్ష గట్టి 2019లో హత్య చేసినందుకు జడ్జి దుర్గారాణి తీర్పునిచ్చిన్నట్లు RCపురం CI జగన్నాథ్ ధ్రువీకరించారు.
News February 25, 2026
SMA Type-1 వ్యాధి అంటే ఏంటి? చికిత్స ఖర్చు ఎందుకు ఎక్కువ?

‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ వ్యాధినే SMA Type-1 అని అంటారు. ఇదొక జన్యుపరమైన వ్యాధి. SMN1 అనే జన్యువు లోపం వల్ల సంభవిస్తుంది. 6 నెలల్లోపు శిశువుల్లో తీవ్రమైన కండరాల బలహీనత, శ్వాస/మింగడంలో ఇబ్బందులు వస్తాయి. దీనికి Zolgensma అనే ఇంజెక్షన్‌ను తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని తయారీ క్లిష్టతరం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అందుకే దీని కాస్ట్ రూ.16 కోట్లు. చికిత్స తీసుకోకపోతే <<19232308>>రెండేళ్లలోపే<<>> మరణిస్తారు.
News February 25, 2026
బాపట్ల: ఫుల్లుగా తాగి బీరు బాటిల్‌తో దాడి

విజయవాడలో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చీరాలకు చెందిన ప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఇక్కడ గదిని అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఇంటి యజమాని బంధువైన షౌకత్ అలీ ఖాన్ అక్కడికి వచ్చి, మా మేనత్త ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న షౌకత్, ప్రసాద్‌పై బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


