News January 25, 2026
ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదు: అరుణ్ గోవిల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదని ‘రామాయణ’ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ అన్నారు. ఒకవేళ అది ఉండుంటే సల్మాన్, షారుఖ్, ఆమీర్ లాంటి ముస్లిం యాక్టర్లు స్టార్లు అయ్యేవారు కాదని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి మతం కూడా కారణం కావొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పేర్కొనడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ గోవిల్ స్పందించారు.
Similar News
News February 6, 2026
ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశం: ట్రంప్

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.
News February 6, 2026
రంగులు మారే శివలింగం.. ఎక్కడంటే?

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్‌లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్‌ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.
News February 6, 2026
అద్భుతం.. ఈ నెల 28న గ్రహాల పరేడ్

ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. బృహస్పతి(గురు), బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే దగ్గర కనిపించనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు, బుధుడు, శని గ్రహాలను పశ్చిమ దిశలో టెలిస్కోప్‌తో చూసే అవకాశం ఉంది. వీటికి సమీపంలోనే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడవచ్చు. ఇక బృహస్పతి చంద్రుడి సమీపంలో నేరుగా కనిపించనుంది.


