News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News March 15, 2025
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.. 337 మంది గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో శనివారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 13,827 మందికి గాను 13,575 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,121 మంది విద్యార్థులకు గాను 2,036 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 337 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 15, 2025
ఖమ్మం: Way2Newsలో కథనం.. అ.కలెక్టర్ పరిశీలన

‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.
News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.