News January 31, 2025

‘ఫీజు పోరు’ పోస్టర్‌ ఆవిష్కరించిన కేతిరెడ్డి

image

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన విమర్శించారు. దీన్ని వైసీపీ ఏ మాత్రం సహించబోదని తెలిపారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని కేతిరెడ్డి స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2026

మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.

News February 13, 2026

హైకోర్టులో పేర్ని నానికి చుక్కెదురు.!

image

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం, డిప్యూటీ సీఎంలను దూషించారంటూ మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌లో నానిపై నమోదైన కేసులో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించినవి కావడంతో క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది.

News February 13, 2026

BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.