News September 5, 2025

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

image

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.

Similar News

News September 5, 2025

సికింద్రాబాద్ PG కాలేజీలో బోధించేందకు ఛాన్స్

image

ఓయూ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో బోధించుటకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కాలేజీలోని హిందీ, ఇంగ్లిష్, గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 5, 2025

HYD: కోర్టు హాల్‌లో దురుసు ప్రవర్తన.. హై కోర్ట్ ఆగ్రహం

image

కోర్టు హాల్‌లో దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సివిల్ సూట్ రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఎందుకు ఇవ్వరంటు జడ్జితో పిటిషనర్ దురుసుగా ప్రవర్తించాడు. పిటిషనర్ చెన్నకృష్ణారెడ్డి సీనియర్ సిటిజన్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నుంచి జడ్జి జస్టిస్ నగేశ్ తప్పుకున్నారు. సీజే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని కోర్ట్ ఆదేశించింది.

News September 5, 2025

HYD: నేడు, రేపు WINES బంద్

image

రేపు గణపతి నిమజ్జనాల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్& రెస్టారెంట్లు ఇవాళ సా.6 నుంచి రేపు సా.6 గంటల వరకు మూసేయాలని CP సుధీర్ బాబు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వైన్సు, బార్‌లు, కల్లుకాంపౌండ్‌లు బార్& రెస్టారెంట్లు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం ఉ.6 గం.కు బంద్ చేయాలని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.