News February 8, 2025

ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు: కలెక్టర్

image

వై.రామవరం మండలం చవిటిదిబ్బలు కస్తూర్బా పాఠశాలలో ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్, నీటి కాలుష్యం జరగలేదని కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 14 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 14 మంది విద్యార్థినులకు వేరు వేరు కారణాల వల్ల జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్సకు ఆసుపత్రకి తరలించామని చెప్పారు.

Similar News

News February 8, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News February 8, 2025

ఆప్‌కు బిగ్ షాక్

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్‌, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.

News February 8, 2025

NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!

image

వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT

error: Content is protected !!