News January 2, 2025
ఫూటుగా పెగ్గులెత్తారు!
అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News January 5, 2025
లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై కలెక్టర్ సమావేశం
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు పరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కాగా అమలు కావాలన్నారు.
News January 4, 2025
ఈనెల 6 నుంచి దివ్యాంగుల పింఛన్ల సామాజిక తనిఖీ
అనంతపురం జిల్లాలో ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్ దివ్యాంగుల పింఛన్లు సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక కార్యక్రమంలో తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తనిఖీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
News January 4, 2025
సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దాం: కలెక్టర్
సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ హోదాలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏయే శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.