News April 11, 2025

ఫూలే జయంతి వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

image

ప్రభుత్వం ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ భవన్లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని  జయప్రదం చేయాలని కోరారు. 

Similar News

News April 18, 2025

చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.

News April 18, 2025

చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

image

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.

News April 18, 2025

చిత్తూరు: ఆర్టీసీ షాపులకు టెండర్లు

image

చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీవో జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్‌ డీపీటీవో కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.

error: Content is protected !!