News September 23, 2025

ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటిన నంద్యాల యువతి

image

ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన అండర్ 17 ఫెన్సింగ్ పోటీలలో నంద్యాలకు చెందిన చిన్మయి శ్రేయ అద్భుతమైన ప్రదర్శన కనపరచి సత్తా చాటింది. ఈ సందర్భంగా సోమవారం నంద్యాలలో చిన్మయి శ్రేయను పలువురు అభినందించారు. అండర్ 17 ఫెన్సింగ్ క్రీడలో రాయలసీమలోని మొదటిసారిగా సత్తా చాటిన చిన్మయి శ్రేయ మన నంద్యాల వాసి కావడం మనందరికీ గర్వకారణమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పేర్కొన్నారు.

Similar News

News September 23, 2025

ములుగు జిల్లాపై ‘వరాల జల్లు’ కురిసేనా..?

image

ములుగు ప్రత్యేక జిల్లా సాధన ఉద్యమానికి మద్దతిచ్చిన CM రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాభివృద్ధికి ఏ మేర సహకారం అందిస్తారోనని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేడు మేడారం పర్యటనకు వస్తున్న ఆయన జిల్లాకు ఏం వరాలు కురిపిస్తారోనని చర్చించుకుంటున్నారు. జర్నలిస్టుల నాయకత్వంలో 2018లో జరిగిన 120KMల పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. కాగా, 2019, FEB 17న ములుగు జిల్లాగా ఏర్పాటైంది.

News September 23, 2025

ప్రకాశం: భార్య చికెన్ వండలేదని ఉరేసుకున్నాడు..!

image

ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. గోళ్లవిడిపి గ్రామంలో ఇళ్ల లక్ష్మీనారాయణ(25) భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం చికెన్ వండాలని లక్ష్మీనారాయణ చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన అతను పొలాల్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 23, 2025

బ్రహ్మచారిణిగా జోగులాంబ అమ్మవారు

image

అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అయిన మంగళవారం, జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఆలయం 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం వద్ద ఈ ఆలయం ఉంది.