News April 4, 2025

ఫెయిల్ అయిన వారికి మరో ఛాన్స్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో B.A, B,COM, B.B.A, BSC,BCA కోర్సుల1,3,5 సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కొద్దినెలల క్రితం ఈ పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడంతో ఆయా సెమిస్టర్ల పరీక్షలు మరోసారి నిర్వహించాలనే వినతుల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల3వ వారం నుంచి నిర్వహించే డిగ్రీ కోర్సుల 2,4,6వ సెమిస్టర్ పరీక్షలతోపాటు నిర్వహించనున్నారు.

Similar News

News April 5, 2025

ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

News April 5, 2025

నారాయణపేట: ‘రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దు’

image

పేద ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని రెండు పార్టీలను ప్రజలు నమ్మకూడదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నారాయణపేట అంబేడ్కర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఏడాదికి రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 

News April 5, 2025

కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామ పాలన అధికారుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏప్రిల్ 16లోపు కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు.

error: Content is protected !!