News February 25, 2025
ఫేక్ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త: ఎస్పీ

ఫేక్ ఉద్యోగ ప్రకటనలు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్‌లు, ఈమెయిల్‌లపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా షేర్ చేయవద్దన్నారు.
Similar News
News March 2, 2026
ఆరోగ్య రక్షణకు ‘వంద రోజుల’ ప్రణాళిక: DMHO

భూపాలపల్లి జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు DMHO డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఆర్బీఎస్‌కే వైద్యాధికారులు, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.
News March 2, 2026
పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి: ASF SP

హోళీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రజలకు సూచించారు. రసాయన రంగుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, పర్యావరణ హిత రంగులనే వాడాలని కోరారు. ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. బలవంతపు చందాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.
News March 2, 2026
ఇజ్రాయెల్ దాడులు.. ‘హెజ్బొల్లా’పై లెబనాన్ నిషేధం

లెబనాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన ‘హెజ్బొల్లా’ మిలిటరీ, సెక్యూరిటీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజకీయాలకే పరిమితం కావాలని, వెంటనే ఆయుధాలు సరెండర్ చేయాలని పీఎం నవాఫ్ సలాం ఆదేశించారు. కాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్‌పై విరుచుకుపడుతోంది. దీంతో లెబనాన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.


