News February 22, 2026
ఫేక్ వార్తలు నమ్మొద్దు: బాపట్ల కలెక్టర్

సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభమయ్యాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అప్లికేషన్ ఫారాలను నమ్మవద్దని సూచించారు. పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, భార్యకు వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రమే ప్రస్తుతం ఉందన్నారు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చేవరకు వదంతులు నమ్మొద్దని కోరారు.
Similar News
News February 22, 2026
FDకి ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

FDకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ బ్యాంక్ ఐదేళ్ల టెన్యూర్‌కు 7.90%, ఉజ్జీవన్ బ్యాంక్ రెండేళ్లకు 7.45% ఇంట్రెస్ట్ అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో SBM Bank (18 నెలల నుంచి 2years 3days) టెన్యూర్‌కు 7.30% వడ్డీ ఇస్తోంది. RBL Bank 7% (18M to 3Y) అందిస్తోంది. పబ్లిక్ సెక్టార్‌లో పంజాబ్ & సింధ్ 6.75% (666 రోజులు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70% (450 రోజులు) హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి.
News February 22, 2026
తెనాలిలో పెళ్లి పేరుతో భారీ మోసం

మ్యాట్రిమోనీ ద్వారా మహిళతో పరిచయం పెంచుకొని ఆమె వద్ద రూ.12 లక్షలు వసూలు చేసి, వివాహం చేసుకోకుండా మోసం చేసిన కొత్తూరులంకకు చెందిన అరవపల్లి వంశీని తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు ఆదివారం అరెస్టు చేశారు. తెనాలికి చెందిన మహిళతో పరిచయం పెంచుకున్న వంశీ ఆమెను పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు.
News February 22, 2026
సరకు రవాణాలో విశాఖ పోర్ట్ చరిత్రాత్మక మైలురాయి

విశాఖ పోర్ట్ అథారిటీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో సరికొత్త రికార్డు సాధించింది. ఫిబ్రవరి 21 నాటికి కేవలం 327 రోజుల్లోనే 80.08 MMT సరకు రవాణా చేసి ఈ మైలురాయిని చేరుకుంది. 2024-25లో 357 రోజుల్లో, 2023-24లో 362 రోజుల్లో ఈ స్థాయిని సాధించింది. పోర్ట్ ఛైర్మన్ అంగముత్తు నాయకత్వంలో వ్యూహాత్మక ప్రణాళికలతో పనితీరు గణనీయంగా మెరుగుపడిందని అధికారులు తెలిపారు.


