News January 8, 2026

ఫేస్‌వాష్ ఎందుకు వాడాలంటే?

image

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఫేస్‌వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. కానీ సబ్బులో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్‌వాష్‌లు చర్మాన్ని మృదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్‌వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.

Similar News

News February 22, 2026

కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన వివరాలు

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈ నెల 22, 23 తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆదోని సమాచార శాఖ అధికారులు తెలిపారు. ఆయన 22న ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన అలంపూర్ చేరుకొని జోగులాంబను దర్శించుకుంటారు. తిరిగి కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం చేరుకుని రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవంలో పాల్గొంటారు.

News February 22, 2026

శ్రీలీలకు బంపర్ ఆఫర్: అజిత్ సరసన క్రేజీ ఛాన్స్!

image

తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీలకు తమిళంలో అద్భుతమైన అవకాశం దక్కినట్లు సమాచారం. కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న ‘AK64’ చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

News February 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. APలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. TGలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.